‘పునర్విచారణ అవ‌స‌రం లేదు’

188
No further probe into Gandhis murder
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గాంధీ హ‌త్య‌కి సంబంధించిన అనుమానాల‌ను, ఆరోప‌ణ‌ల‌ను ఈ నివేదిక ద్వారా సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్‌ అడ్వొకేట్‌ అమరేందర్‌ శరణ్ ఖండించారు. మహాత్మాగాంధీని గాడ్సేనే హతమార్చాడని.. ఇందులో విదేశీ నిఘా సంస్థల వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

 No further probe into Gandhis murder

నేషనల్‌ అర్కైవ్స్‌ నుంచి అవసరమైన పత్రాలు, నివేదిక క్షణ్ణంగా పరిశీలించాకే ఈ నివేదికను రూపొందించినట్లు అమరేందర్‌ వెల్లడించారు. నాలుగో బుల్లెట్‌ గాంధీ ప్రాణం తీసిందన్న ఆరోప‌ణ‌ను కూడా ఆయ‌న తోసిపుచ్చారు. గాంధీ హ‌త్య కేసు విష‌య‌మై పున‌ర్విచార‌ణ కోరుతూ ముంబైకి చెందిన పరిశోధకుడు, అభినవ్‌ భారత్‌ సంస్థ ట్రస్టీ పంకజ్‌ ఫడ్నవీస్‌ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే గాంధీ హ‌త్య విష‌యంలో జోక్యం చేసుకొనే హక్కు పంకజ్‌కు లేదంటూ గాంధీ మునిమ‌న‌వ‌డు తుషార్ వాదించారు. దీంతో ఈ కేసు గురించి పూర్తి వివ‌రాల కోసం సుప్రీంకోర్టు, అమ‌రేంద‌ర్ శ‌ర‌ణ్ స‌హాయం కోరింది.

- Advertisement -