మైనారిటీలకు తీవ్ర నిరాశే..!

3
- Advertisement -

ఈ బడ్జెట్ లో మైనారిటీ లకు తీవ్ర నిరాశనే మిగిల్చింది అన్నారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్. ముఖ్యమంత్రి మైనారిటీ లకు సబ్ ప్లాన్ అని చెప్పారు.. కేవలం 3500 కోట్లు మాత్రమే మైనారిటీ లకు కేటాయింపు చేశారు.అది కూడ అంకెలు చూపించుకోవడానికి మాత్రమేనన్నారు.

మైనారిటీ లను మరోసారి కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది.. బడ్జెట్ లో 3500 కోట్ల సంఖ్య చూపెట్టిన ఖర్చు చేసింది గత సంవత్సరం కేవలం వెయ్యి కొట్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ల కోసం ఏ కొత్త పథకం పెట్టలేదు… తెలంగాణ మైనార్టీ సోదరులు గమనించాలి అన్నారు.

సబ్సిడీ అన్నారు కానీ దానికి కూడా బ్యాంక్ తో లింక్ పెట్టారు..ఇమాం మౌజం లకు గౌరవ వేతనం పెంచుతాం అన్నారు ఇప్పటివరకు పెంచలేదు అన్నారు. రంజాన్ పండుగ వచ్చిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేదు… రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ గమనించాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ముస్లింలను మోసం చేసింది అన్నారు.

Also Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్

- Advertisement -