బరువు తగ్గెందుకు సింపుల్ చిట్కాలు!

62
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు పెరగడం. తినే ఆహారంలో మార్పుల కారణంగా కొద్దిగా తిన్నప్పటికి విపరీతంగా బరువు పెరుగుతుంటారు. అంతే కాకుండా శారీరక శ్రమ తగ్గడం.. గంటల తరబడి కూర్చొని పని చేయడం వంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోయి ఉబకయానికి దారి తీస్తుంది. ఇక బరువు పెరిగినవారు తగ్గాలంటే అంతా సులువు కాదు. కచ్చితమైన ఆహార డైట్ ఫాలో అవుతూ, జిమ్, ఎక్సరసైజ్ వంటివి చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో ఎక్సరసైజ్ చేసినప్పటికీ బరువు తగ్గుదలలో పెద్దగా మార్పులు కనిపించవు. అలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.

సాధారణంగా అధిక బరువు ఉన్నవాళ్ళు ప్రోటీన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటే శరీర బరువు మరింత అధికమౌతుంది. అందువల్ల ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, పాలు, గుడ్డు, చేపలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ తినాల్సి వస్తే తినే ముందు ఒక గ్లాస్ నీరు తాగి తినాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా తినేలోపే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు పెరగకుండా అదుపులో ఉండవచ్చు.

నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. భోజన చేసే ముందు మరియు భోజనం చేసిన తరువాత నీరు త్రాగడం వల్ల తీసుకునే ఆహారం లిమిట్ లోకి వస్తుంది. మిగిలిన సమయాల్లో కూడా ఎక్కువగా తాగాలి ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఎందుకంటే తీసుకునే ఆహారంలో పీచు ఉంటే ఆకలి మందగించేలా చేస్తుంది. ఉదాహరణకు ఒట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్పౌర్ట్స్, నారింజా, గోదుమ వంటి వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. దాంతో వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read: Telangana Budget:రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్

ఇంకా కొద్ది దూరానికి కూడా వాహనాన్ని వాడడం వంటివి చేయకుండా సాధ్యమైనంత వరకు నడకకే అధిక ప్రదాన్యం ఇవ్వాలి. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిచాలి.. ఇలాంటి కొన్నిచిట్కాలు సూచనలు పాటించడం వల్ల.. ఎలాంటి డైటింగ్ నియమాలు లేకుండా ఎలాంటి జిమ్ కసరత్తులు చయకుండా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు.

 

- Advertisement -