Pawan:పవన్.. ప్రచారమేది?

55
- Advertisement -

తెలంగాణ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. దాంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సై అన్నారు. మొదట 32 స్థానాల్లో బరిలోకి దిగుతున్నట్లు కూడా ప్రకటించారు కానీ ఆల్రెడీ ఏపీలో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా తెలంగాణలో కూడా అదే దోస్తీ కొనసాగించేలా పవన్ అడుగులు వేశారు. అందుకే తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తుకు ఒకే చెప్పి ఆ పార్టీ కేటాయించిన 8 స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ సిద్దమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రచారం విషయంలో మాత్రం పవన్ నిమ్మకు నీరేత్తినట్లు ఉన్నారు. ఏపీలో రోడ్ షోలు, వారాహి యాత్రలు, జనవాణి.. వంటి కార్యక్రమాలు, ప్రచారలతో నిత్యం ప్రజల్లో ఉండే పవన్.. తెలంగాణలో మాత్రం అలా చేయడం లేదు.

ఇంతవరకు అధికారికంగా పవన్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టకపోవడంతో అటు బీజేపీ కూడా కొంత కలవరానికి లోనవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం చేసిన పెద్దగా ఫలితముండదనే ఆలోచనలో పవన్ ఉన్నారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ మద్య వారాహి యాత్ర తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలని భావించిన జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిన తరువాత ఆ ఆలోచనను కూడా హోల్డ్ లో ఉంచింది. దీంతో తెలంగాణ ఎన్నికలను పవన్ లైట్ తీసుకున్నారనే వాదన రోజురోజుకూ పెరుగుతోంది. అలాంటప్పుడు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్లు అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తమవుతున్నాయి. కేవలం బీజేపీ కోసమే ఎన్నికల బరిలో ఎన్నికల బరిలో పవన్ నిలిచారనే చెప్పక తప్పదు. ప్రస్తుతం బీజేపీ బలంగా లేనందున ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Also Read:Harishrao:ఎన్నికల్లో గెలవగానే సన్నబియ్యం

- Advertisement -