అక్కినేని ఫ్యామిలీ నుండి పుష్కర కాలం క్రితం టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్. ఈ పుష్కర ప్రయాణంలో సుమంత్ సాధించిన సక్సెస్‌లను వేళ్ల మీద లెక్కించొచ్చు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్న సుమంత్…చాలాకాలం తర్వాత నరుడో డోనరుడా అంటూ పలకరించిన హిట్ బాటమాత్రం పట్టలేదు. లేటెస్ట్‌గా మళ్లీరావా అని పలకరించిన సుమంత్ తిరిగి ఫాంలోకి రావడమే కాదు సక్సెస్ బాటపట్టాడు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమంత్…మామ నాగార్జునతో విభేదాలపై స్పందించాడు. నాగేశ్వరరావు మరణం తర్వాత ఆస్తిపంపకాల్లో విభేదాలు తలెత్తాయని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు దీనిపై వీరిద్దరు స్పందించలేదు. కానీ తాజాగా సుమంత్ ఆవార్తలకు పుల్ స్టాప్ పెట్టాడు.
తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట అవాస్తవమని స్పష్టం చేశాడు సుమంత్. అసలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని.. తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని.. తరచుగా కలుస్తుంటానని చెప్పాడు. మేమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పుకొచ్చిన సుమంత్.. అఖిల్.. చైతూ.. రానా.. ఇలా తన ఫ్యామిలీ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉందని.. వీరితో కలిసి సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానని తెలిపాడు.
ప్రేమకథ సినమాతో సుమంత్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసింది నాగార్జునే. సుమంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలోనూ ‘సత్యం’ సినిమాను నిర్మించి అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు.