నో కాస్ట్ EMI.. లాభామా నష్టమా ?

46
- Advertisement -

సాధారణంగా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే వాళ్ళు నో కాస్ట్ EMI అనే పదాన్ని ఎక్కువగా విని ఉంటారు. పండుగ సమయాల్లోనూ లేదా ఈ కామర్స్ సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటించినప్పుడు చాలా వస్తువులపై నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఆఫర్ ను ప్రకటిస్తుంటాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు. అలాంటి సమయాల్లో మన దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్ లేదా ఇతరత్రా EMI కార్డ్స్ ఉపయోగించి ఆన్లైన్ లో మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటాము. ఈ నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ అనగా మనం కొనుక్కునే వస్తువులపై ఎలాంటి వడ్డీ భారం ఉండదు. ఆ వస్తువు యొక్క సాధారణ ధరకే ఈ‌ఎం‌ఐ లో లభిస్తుంది. అయితే ఇక్కడ ప్రతిఒక్కరి ఒక సందేహం వచ్చే ఉంటుంది.. అదేమిటంటే నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఇవ్వడం వల్ల కంపెనీలకు ఏంటి లాభమని ? అలాగే నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ లో వస్తువులు కొనుగోలు చేస్తే ఏమైనా నష్టం వాటిల్లుతుందా ? అనే డైట్ కూడా చాలమందికి వచ్చే ఉంటుంది. వీటి గురించి తెలుసుకుందాం !

నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ అనగానే నెల నెల వడ్డీ కట్టాల్సిన అవసరం లేనందున చాలమంది నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే ప్రతినెలా ఈ‌ఎం‌ఐ కట్టడంలో చాలమంది జాప్యం చేస్తుంటారు. ఫలితంగా వారిపై అధనపు టాక్స్ ల భారం పడుతుంది. అప్పుడు ప్రతి నెల కట్టాల్సిన ఈ‌ఎం‌ఐ కంటే కాస్త ఎక్కువే కట్టాల్సి వస్తుంది. ఇలా కంపెనీలు నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ల ద్వారా లాభం పొందుతాయి.

ఇక నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ లో వస్తువులు కొనుక్కోవడం వల్ల లాభామా నష్టమా అనే డౌట్ కూడా చాలమందికి వచ్చే ఉంటుంది. అయితే నో కాస్ట్ EMI లో వస్తువులు కొనుక్కోవడం వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా వస్తువులు ఆన్లైన్ లో కొనుకున్నప్పుడు వైటిపై కొన్ని ఆఫర్స్ ను ప్రకటిస్తుంటాయి కంపెనీలు. క్యాష్ బ్యాక్ ఇవ్వడం లేదా వివిధ రకాల కూపన్ ఇవ్వడం వంటివి చూస్తుంటాయి. నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఆప్షన్ ఎంచుకుంటే ఈ ఆఫర్స్ వర్తించవు. కానీ వస్తువు సాధారణ ధరను వాయిదాల రూపంలో ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు నో కాస్ట్ EMI అనేది ఉపయోగకరమే.

ఇవి కూడా చదవండి…

విస్తరిస్తున్న XBB1.16 వేరియంట్‌

క్యారెట్ జ్యూస్ తో లాభాలు…

మరిచాసనంతో ఆ సమస్యలు దూరం!

- Advertisement -