సిబిల్ స్కోర్ తక్కువ..ఉద్యోగం పోయింది

4
- Advertisement -

వినడానికి వింతగా ఉన్నా తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఉద్యోగిని జాబ్ నుండి తీసేసింది ఎస్‌బీఐ. బ్యాంక్ నిర్ణయాన్ని సమర్ధించింది చెన్నై హైకోర్టు.

చెన్నై – సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని కార్తికేయన్ అనే వ్యక్తిని సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీఓ) పదవి నుండి తొలగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.దీనిపై చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కార్తికేయన్.

ప్రజాధనం నిర్వహించే వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం.. లోన్లు తీసుకోని కట్టకుండా, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారిపై నమ్మకం ఎలా కలుగుతుందని, ఎస్‌బీఐ నిర్ణయాన్ని సమర్దిస్తున్నామని పిటిషన్ కొట్టేసింది చెన్నై హైకోర్టు.

Also Read:Mysaa:సరికొత్త లుక్‌లో రష్మిక

- Advertisement -