మెరిసిపోతుంది.. మరి ఛాన్సులేవీ?

63
- Advertisement -

తెలుగు తెర పై అందంలోనూ అభినయంలోనూ మంచి ప్రతిభ చూపించగల ముద్దుగుమ్మ అషు రెడ్డి. కానీ, ఛాన్స్ లే లేవు. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ చేస్తున్నా ఎందుకో అషు రెడ్డికి మేకర్స్ అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ ఎప్పటికప్పుడు అషు రెడ్డి తన గ్లామర్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటూనే ఉంది. అయినా, అషు రెడ్డికి కాలం కలిసి రాలేదు. హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. ఐతే, కొంతకాలంగా…అషు రెడ్డి హీరోయిన్ రోల్స్ కోసం పరితపిస్తోంది

అందుకే, అషు రెడ్డి ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చేసుకుంది. అందరూ షాకయ్యే స్లిమ్ మేకోవర్ తో మెరిసిపోతుంది. ఇది వరకటి అషు రెడ్డికి, ఇప్పటి అషు రెడ్డికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. లేటెస్ట్ గా అషు రెడ్డి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. బాగా సన్నగా చక్కని ఫిజిక్ తో అషు రెడ్డి ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అషు రెడ్డి ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి.

మరి అషు రెడ్డి కొత్త అవతారంతోనైనా ఆమెకు ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి. ఇదే క్రమంలో అషు రెడ్డికి ఈ సారి భారీగా డిమాండ్ పెరుగుతుందని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. మరి, అషు రెడ్డి సినిమాల్లో బిజీ అవుతుందా ?, ఆమెకు అవకాశాలు వస్తాయా ?, అషు రెడ్డి అభిమానులు అయితే ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు. చూడాలి మరి, అషు రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో !!

ఇవి కూడా చదవండి..

- Advertisement -