గత కొన్నాళ్లుగా రంజీలకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. పూర్తిగా టీమిండియాకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరికి చోటు దక్కలేదు. దాంతో వీరికి టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లేనని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా రంజీలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ ఇద్దరినీ బీసీసీఐ గట్టిగానే హెచ్చరిస్తూ వచ్చింది. కానీ వీరు రంజీలపై కంటే ఐపీఎల్ పైనే ఎక్కువ దృష్టి సారించడంతో తాజాగా గట్టి షాక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన రిటైనర్ షిప్ లో గ్రేడ్ ఏప్లెస్ లో రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా, బుమ్రా, ఉన్నారు. గ్రేడ్ ఏ లో అశ్విన్, షమి, సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హర్ధిక్ పాండ్య.. గ్రేడ్ బి లో సూర్య కుమార్ యాదవ్, పంత్, కుల్దీప్, అక్షర్ పటేల్, జైస్వాల్ ఉండగా.. గ్రేడ్ సి లో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్, శార్దూల్, శివం దూబే, బిష్నోయ్, జితేష్, సుందర్.. ఇలా కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. .
అయితే లిస్ట్ లో ఎక్కడ శ్రేయస్ అయ్యర్, ఇషన్ కిషన్ ల పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో బీసీసీఐ కంప్లీట్ గా వారిని పక్కన పెట్టినట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వారిద్దరు మళ్ళీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే సమాధానాలు వినిపిస్తున్నాయి. రిటైనర్ షిప్ లో లేకపోయినప్పటికి దేశవాళీ క్రికెట్ లోనూ, అలాగే ఐపీఎల్ టోర్నీలోనూ వారిద్దరు అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. తిరిగి టీమిండియాలో చోటు సంపాధించుకునే అవకాశం ఉంది. మొత్తానికి అయ్యర్, ఇషన్ లను పక్కన పెట్టడంపై బీసీసీఐ తీరును తప్పుబడుతూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిన శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరి వీరిద్దరూ తిరిగి టీమిండియాలోకి ఎప్పుడు అడుగు పెడతారో చూడాలి.
Also Read:ఈ ఆకు గురించి తెలిస్తే.. తినకుండా ఉండలేరు!