ఈ మధ్య తెలంగాణ రాజకీయల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మధ్య దోస్తీ కుదిరిందని, ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని.. ఇలా రకరకాల వాదనలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. బీజేపీ బిఆర్‌ఎస్ మధ్య దోస్తీ అనే విమర్శ ను కాంగ్రెస్ మరింత హైలైట్ చేస్తుండడంతో ఇది కాస్త తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విమర్శలో ఎలాంటి నిజం లేదనే విషయం రాష్ట్ర రాజకీయలను ఫాలో అయ్యే ప్రతిఒక్కరికి తెలుసు. అయినప్పటికి అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా బీజేపీ విధానాలను, మోడి పాలనను తీవ్రంగా ఎండగడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.
అలాంటి బీజేపీతో కేసిఆర్ జట్టు కట్టడం కలలో కూడా జరగని పని. కానీ ఏవేవో కారణాలు చూపిస్తూ బీజేపీ, బిఆర్‌ఎస్ మధ్య ఏదో ఉందని లేని విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి అవాస్తవ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. దేశాన్ని నాశనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాత్ర అధికంగా ఉందని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: రాహుల్ నాయకత్వంపై డౌటే ?
దేశాన్ని నాశనం చేసిన పార్టీలతో కలవడం ఎప్పటికీ జరగదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కేటిఆర్ వ్యాఖ్యలు చెంప పెట్టులా మారాయి. ఇదిలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 కు పైగా సీట్లు బిఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ తో ఉన్నారని, బిఆర్‌ఎస్ విజయం తథ్యం అంటూ కేటిఆర్ కుండ బద్దలు కొట్టారు. మొత్తానికి రాజకీయ లబ్ది కోసం బిఆర్‌ఎస్ ను దెబ్బతీసే విధంగా ఎలాంటి విమర్శలు తెరపైకి తెచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది అందరికీ తెలిసిన విషయం.
Also Read: HarishRao:సుతి లేని బీజేపీ..మతి లేని కాంగ్రెస్.!