క్యాష్‌ విత్డ్రా పై ఆంక్షలు ఎత్తివేత

222
No cash withdrawal limit from ATM
- Advertisement -

నగదు విత్ డ్రాకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ మరింత సవరించింది. పెద్దనోట్ల రద్దు తరువాత న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న బ్యాంకు ఖాతాదారుల‌కు ఊర‌ట క‌లిగించేలా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణ‌యం తీసుకుంది. క్యాష్ విత్ డ్రా నిబంధనల నుంచి కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులకు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పేర్కొంది.

సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు మాత్రం ఏటీఎంల నుంచి డెయిలీ విత్ డ్రా లిమిట్ పై ఆంక్షలు ముందులాగే కొనసాగనున్నాయి. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది.

నవంబర్‌ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే. కరెంట్‌ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది.

- Advertisement -