BJP:అభ్యర్థులు కావాలండోయ్ !

45
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం అంతర్మథనంలో మగ్గుతోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పటికే అభ్యులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ కాషాయ పార్టీలో మాత్రం అసలు బరిలో నిలిచేందుకు అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. తెలంగాణలో అధికారం మాదేనని, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామని చెప్పే బీజేపీ, అభ్యర్థుల కొరత వేధించడం నిజంగా ఆశ్చర్యమే. పోటీ చేసే సీట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికి.. ఎవరు సరైన అభ్యర్థులు కాకపోవడంతో వారి ఎంపిక బీజేపీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది..

ఒకవైపు నేతల విభేదాలు, మరోవైపు పార్టీలో చీలిక, అసమ్మతి సెగలు.. ఇలా ఎన్నో సమస్యలు ఆ పార్టీని వేధిస్తున్నాయి. వీటన్నిటిని దాటుకొని తొలి జాబితా అభ్యర్థులను ప్రకటిస్తే ఆ తరువాత వచ్చే పరిణామాలు కూడా పార్టీని తీవ్రంగా కుంగదీస్తాయి. ఇక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రేపు లేదా మర్నాడు బీజేపీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందట. తొలి జాబితాలో 40 అభ్యర్థులను కన్ఫర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు శంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయానికి వచ్చిందట. అయితే తొలి జాబితాలో టికెట్లు ఆశించిన వారికి సీట్లు దక్కకపోతే నిరభ్యంతరంగా పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉన్న నేతలు కూడా పార్టీని వీడితే కమలం వాడిపోయే అవకాశాలే ఎక్కువ. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాషాయ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Also Read:దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ సంచలన విజయం

- Advertisement -