బోనస్ కోసం పడిగాపులు?

5
- Advertisement -

సన్న వడ్లకు బోనస్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం ప్రకటనకే పరిమితమైందన్న వాదన వినిపిస్తోంది. సన్న వడ్ల బోనస్ కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదు ప్రభుత్వం.

దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేయగా, బోనస్ రూపంలో సుమారు రూ.1000 కోట్లు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. ఈ యాసంగి సీజన్లో 65% దొడ్డు వడ్లు సాగు చేసిన రైతులు, బోనస్ వస్తుందనే ఆశతో గత సీజన్లో అధిక మొత్తంలో సన్నాలు సాగు చేశారు రైతులు.

గత సీజన్లో బోనస్ చెల్లింపులో ఆలస్యం అవ్వడం, అనేక మంది రైతులకు బోనస్ రాకపోవడంతో ఈ సీజన్లో దొడ్డు వడ్లకే మొగ్గు చూపారు రైతన్నలు. కొనుగోలు కేంద్రాల వద్ద సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు అధికారులు. ప్రభుత్వం మీద నమ్మకంతో సన్న వడ్లు సాగు చేశామని, బోనస్ చెల్లింపు ప్రక్రియ మొదలుపెట్టాలని వేడుకుంటున్నారు రైతులు.

Also Read:TG:రెండు రోజులు వర్షాలు

- Advertisement -