జూన్ 10వ తేదీ బుధవారం టాలీవుడ్ హీరో,నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ బర్త్ డేతో బాలయ్య 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాలయ్య బర్త్ డే వేడుకలు జరుపుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానసోదరులందరికీ ఆత్మీయ విజ్ఞప్తి.నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండుగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నా శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులైన మీ అందరితో వేడుకలు జరుపుకునేందుకు అవాంతరం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఇలాంటి సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ అందరి క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదమని బాలకృష్ణ పేర్కొన్నారు. మీరంతా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ నన్ను కలవడానికి రావొద్దని’ బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.