పుట్టినరోజు వేడుకలకు దూరం: వినోద్ కుమార్

313
vinod kumar
- Advertisement -

కరోనా నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌.మీ అందరి ఆశీస్సులతో ఈనెల జులై 22 వ తేదీన జరుగనున్న నా పుట్టిన రోజు సందర్భంగా మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు…

ప్రస్తుతం కొవిడ్-19 దురదృష్ట పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదన్నారు.నా విజ్ఞప్తిని మన్నించి కేవలం మీ ఆశీస్సులు అందించాలనీ, కానీ పుట్టిన రోజు వేడుకలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదని కోరుతున్నానని తెలిపారు.

- Advertisement -