స్కిల్ స్కామ్ లో రిమాండ్ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఈ కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు. 24 న ఈ కేసు పై స్పష్టత వస్తుందని భావించినప్పటికి మరో రెండు రోజులు సీఐడీ రిమాండ్ విధించడంతో ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. గత రెండు రోజులుగా సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబు సరైన సమాధానాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రిమాండి మరికొన్ని రోజులు పెరిగే అవకాశం ఉంది. ఎలాగైనా ఈ కేసు పై మరింత సమాచారం రాబట్టలని సీఐడీ అధికారులు ప్రయత్నిస్తుంటే ఈ కేసు నుంచి తప్పించుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. మొన్న ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీ సమయం ఇవ్వగా అది సరిపోలేదని ఈసారి సుప్రీం కోర్టులో ఎస్ ఎల్ పి పిటిషన్ వేయాలనే ఆలోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు.
ఈ నేపథ్యం స్కిల్ స్కామ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తమౌతోంది. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని పక్కా ఆధారాలతో సమాచారాన్ని కూపి లాగాలని అధికారులు భావిస్తున్నప్పటికి మాజీ సిఎం హోదాలో బాబు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని వినికిడి. మరోవైపు బెయిల్ కోసం టీడీపీ శ్రేణులు గట్టి ప్రయత్నలే చేస్తున్నారు. అటు ఈ స్కామ్ లో నారా లోకేశ్ పాత్ర కూడా ఉందనే ఆరోపణాలు వస్తున్నాయి. దాంతో ఈ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడడం టీడీపీకి కత్తిమీద సాముల మారింది. ఇక ఎలక్షన్లకు ఎనిమిది నెలలే సమయం ఉండడంతో ప్రచారంలో వేగం పెంచేందుకు వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. టీడీపీ మాత్రం ఈ స్కామ్ లతో కొట్టు మిట్టాడుతుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయడం విశ్లేషకులకు సైతం కష్టతరంగా మారింది.
Also Read:చంద్రముఖి 2…అందరికీ నచ్చుతుంది