రోడ్ల‌పై అన్న‌దానాలు చేయ‌రాదు- మేయ‌ర్

176
- Advertisement -

నగరంలో ఉన్న‌ యాచకులకు షెల్టర్ హోంలలో వసతి కల్పించి, ఉచిత భోజనం అందిస్తున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం పాత సెక్రెటరియేట్ ముందు వున్న 60 మంది యాచకులను గుర్తించి,వారిని 108 వాహనాలు ద్వారా అమీర్ పేట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన తాత్కాలిక షెల్టర్‌కు పంపించారు. అదే సమయంలో యాచకులకు అన్నదానం చేసేందుకు వచ్చిన కార్తీక్, అతని స్నేహితులతో మాట్లాడి, ఇక నుండి రోడ్లపై అన్నదానం చేయరాదని సూచించారు. ఆసక్తి యుంటే షెల్టర్ హోంలలో అధికారుల ద్వారా మాత్రమే అన్నదానం చేయాలని చెప్పారు. కార్తీక్, మిత్రులు తెచ్చిన భోజనం నాణ్యతను పరిశీలించి, అభినందించారు. జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పనిచేయాయాలని సూచించారు.

bonthu ramohan

హోటళ్లు, లాడ్జిలలో 10 రాష్టాలకు చెందిన వారు పని చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అవి మూతపడటంతో, వారందరు దాతలు పెడుతున్న భోజనము చేస్తున్నారు. ఇక్కడ వున్న ఐదుగురు స్థానికులను గుర్తించి, ప్రభుత్వం నుండి బియ్యం, నగదు తీసుకొని దాత‌లు పెట్టే భోజ‌నానికి బయటకు వచ్చినందున వారిని కూడా షెల్టర్ హోంకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల‌కు మీద‌కు వ‌చ్చి వైర‌స్ త‌గిలించుకొని ఇంట్లోవాళ్ల‌కు అంటిస్తారా అని వారిని ప్ర‌శ్నించారు. ఇక‌పై అటువంటి వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు హెచ్చ‌రించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మేయర్‌ తెలిపారు. అదే సమయంలో లాక్ డౌన్ వలన నగరంలో ఏ వ్యక్తి ఆకలితో అలమటించరాదని ముఖ్యమంత్రి కేసిఆర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెడుతున్నట్లు తెలిపారు.

mayor

అనాధలు, నిరాశ్రయులు, యాచకులకు ఆశ్రయం కల్పిస్తున్న‌ట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి ద్వారా 25 షెల్ట‌ర్ హోంలు న‌డుపుతున్న‌ట్లు.. అదేవిధంగా ఎన్‌.జి.ఓల స‌హ‌కారంతో 85 చోట్ల ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తం 4,600 మందికి ఈ షెల్ట‌ర్ల‌లో భోజ‌నం వ‌స‌తులు, ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయిస్తున్న‌ట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్ దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో దాదాపు 400 మంది యాచ‌కులు ఉన్నార‌ని, వారంద‌రినీ షెల్ట‌ర్ హోంల‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా న‌గ‌రంలోని యాచ‌కుల‌ను గుర్తించి స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. గ‌త రెండు రోజుల్లోనే 200 మందిని షెల్ట‌ర్ హోంల‌కు త‌ర‌లించిన‌ట్లు వివ‌రించారు. సామాజిక దూరం వ‌ర్తింప‌చేయుట‌కై ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, స్టేడియంల‌లో యాచ‌కుల‌కు వ‌స‌తి క‌ల్పిస్తున్న‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు.

- Advertisement -