తెలంగాణలో తిరుగులేని పార్టీ టీఆర్ఎస్ అని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మెట్పల్లి మండలం వెంకట్రావుపేటలో 33/11 కేవీ సబ్ స్టేషన్కు కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన 2 వేల మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ కవిత వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్రెడ్డి రాష్ర్టాభివృద్దికి అడ్డుపడొద్దని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కరెంటు సరఫరాలో అంతరాయం లేదని.. వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తున్నామని కవిత అన్నారు.
కాగా, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారితోపాటు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు.