బీజేపీకి ‘పొత్తు’ గండం!

41
- Advertisement -

ఏపీలో బీజేపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే ఆ పార్టీకి పొత్తు అంశం వీడని చిక్కుముడిగా మారింది. గత కొన్నాళ్లుగా ఆ పార్టీ జనసేనతో దోస్తీ కొనసాగిస్తోంది. కానీ అనూహ్యంగా పవన్ టీడీపీ పక్షాన చేరడంతో కాషాయ పార్టీకి అసలు సమస్య మొదలైంది. అటు పవన్ టీడీపీ మరియు బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం పవన్ ఒకే.. చంద్రబాబూ నాట్ ఒకే అంటోంది. దాంతో జనసేనతో పొత్తు కొనసాగిస్తే టీడీపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు అధిష్టానం విముఖత చూపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనే సందేహాలు వ్యక్తమౌతవచ్చాయి. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటే స్థాయిలో బీజేపీ లేదు. పైగా తెలంగాణ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కె పరిమితం అవుతూ ఘోర ఓటమిని చవిచూసింది.

ఈ నేపథ్యంలో ఏపీలో కచ్చితంగా బలం చాటుకోవాల్సిన పరిస్థితి. కానీ ఏపీలో రాజకీయ పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. దాంతో కమలనాథులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. టీడీపీ జనసేన కూటమితో కలవాలా లేదా సింగిల్ గా బరిలోకి దిగలా అనే కన్ఫ్యూజన్ ఏపీ బీజేపీ నేతలను వేధిస్తోంది. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి జనసేనతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. కానీ టీడీపీ తో కలవడంపై హైకమాండ్ దే తుది నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ వైఖరి చూస్తుంటే టీడీపీకి దగ్గరగా బీజేపీకి దూరంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీతో జనసేన పొత్తు నామమాత్రంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమితో కలవడం తప్ప బీజేపీకి వేరే ఆప్షన్ లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి బీజేపీ ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Also Read:జూనియర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆ హీరోయిన్!

- Advertisement -