ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోలిటికల్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ జనసేన చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన నిర్ణయాలను బట్టే టీడీపీ, బీజేపీ వంటి పార్టీల భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ వేస్తున్న ప్రతి అడుగు ఈ రెండు పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనసేన దోస్తీ టీడీపీ, బీజేపీ పార్టీలకు అత్యంత కీలకం. జనసేన తమతో కలిస్తే వచ్చే ఎన్నికల్లో సులువుగా అధికారం చేపట్టవచ్చని టీడీపీ ఆలోచిస్తోంది. అందుకే పవన్ తో చేయి కలిపేందుకు చంద్రబాబు ఎంతో ఆతురతగా ఉన్నారు.
అటు బీజేపీకి కూడా జనసేనతో బంధం చాలా అవసరం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అండతోనే ఏపీలో బలపడాలని చూస్తోంది కాషాయ పార్టీ.అందుకే పదే పదే పవన్ తమ వాడని కమలనాథులు చెబుతున్నారు. ఇక ఇక్కడ పవన్ అనుసరిస్తున్న వ్యూహరచన ఆ రెండు పార్టీలకు కూడా అంతుచిక్కని ప్రశ్నలాగే ఉంది. తాము బీజేపీతోనే ఉన్నామని చెబుతూనే.. అటు టీడీపీకి కూడా స్నేహ హస్తం అందిస్తున్నారు పవన్. జనసేనాని అనుసరిస్తున్న ఈ రెండుకాళ్ళ పోకడ బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇక ఇటీవల మచిలీపట్నంలో జరిగిన భహిరంగ సభలో బీజేపీకి పవన్ ఇచ్చిన స్ట్రోక్ ఆ పార్టీని కుదేలు చేస్తోంది. మోడీ చేస్తున్న అభివృద్ది కారణంగానే తాము బీజేపీతో చేతులు కలిపామని చెప్పిన పవన్.. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తే పొత్తుకు స్వస్తి పలకడం ఖాయమని పవన్ హెచ్చరించారు.
ఇదే టైమ్ లో తాము టీడీపీతో కలిసిన ఆశ్చర్యం లేదనే హింట్ కూడా ఇచ్చారు. ఇదే ప్రస్తుతం బీజేపీని కలవరపరుస్తున్న అంశం. ఎందుకంటే పవన్ బీజేపీతో తెగతెంపులు టీడీపీతో కలిస్తే చంద్రబాబుతో కలిసేందుకు కాషాయ పార్టీ సిద్దంగా లేదు. దాంతో కాషాయ పార్టీకి ఒంటరిపోరే దిక్కు అనేది కొందరి అభిప్రాయం. ఒకవేళ టీడీపీ జనసేన పార్టీలను కాదని బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటే పరిస్థితులు కూడా లేవు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదన్నది కొందరి వాదన. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి బలమైన నాయకుల కొరత అధికంగానే ఉంది. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి ప్రజాధరణ కూడా లేదు. అందువల్ల బీజేపీ పొత్తు నుంచి జనసేన ఏ మాత్రం బయటకు వచ్చిన.. ఏపీలో కమలం పార్టీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ అని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.
ఇవి కూడా చదవండి..