లీడర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హీరో రానా. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాహుబలితో స్టార్ హీరోగా మారిపోయాడు. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటన్న రానా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లి తెరపై తనకు అచ్చొచ్చిన నెంబర్ 1 యారి సీజన్ 2ను చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నెంబర్ 1 యారీ సీజన్ 2 కర్టైన్ రైజర్ మీట్లో షో గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను ఫ్రెండ్షిప్ని నమ్ముతానని …ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం స్నేహితులేనని చెప్పుకొచ్చారు. తన జీవితంలో స్నేహితులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
నెం 1 యారి సీజన్ 1 నుంచి చాలా నేర్చుకున్నాని చెప్పారు. సీజన్ 1 సక్సెస్ సాధించింది కాబట్టే సీజన్ 2కి కూడా తననే హోస్ట్‌గా ఉండాలని నిర్వాహకులు కోరారని చెప్పారు. మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. నా స్నేహితుల్లో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారని…తాను, నాని ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అన్న విషయం చాలామందికి తెలియదన్నారు. ఈసారి మీకు తెలియని నా స్నేహితులు పాల్గొన బోతున్నారని చెప్పారు.