- Advertisement -
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు సమావేశం అయ్యారు. పసుపు బోర్డుకు సంబంధించి వారు చర్చించారు. పసుపు బోర్డు కోసం మలి దశ ఉద్యమానికి జిల్లా పసుపు రైతులు సిద్దమయ్యారు. పసుపు బోర్డు, మద్దతు ధర సాధనే లక్ష్యంగా పోరాటం చేయనున్నారు. ఈసందర్భంగా పార్టీలకు అతీతంగా రైతులు సమావేశమయ్యారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత 15రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని హామి ఇచ్చిన ఎంపీ అరవింద్ మాట తప్పారని గుర్తు చేసుకున్నారు. కానీ, అతను ఈవిషయంపై ఇప్పటికీ చొరవ చూపకపోవడం శోచనీయమనీ, కనీసం ఎర్రజొన్న మద్ధతు ధరను సైతం పెంచడంపై కూడా వారు దృష్టి సాధించడం లేదని ఈ సందర్భంగా రైతులు అతనిపై మండిపడ్డారు ఎంపీ అరవింద్ ఇచ్చిన మాటకు కట్టబడి లేనందునే ఉద్యమానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు పసుపు రైతులు.
- Advertisement -