నా నంబర్ ఇవ్వను.. అభిమానితో నివేదా..

224
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి చిత్రం ‘జెంటిల్ మెన్’ తోనే మంచి విజయాన్ని అందుకుని, అందరి దృష్టిని ఆకర్షించింది నివేదా థామస్. ఆ తరువాత ఆమె నాని హీరోగా తెరకెక్కిన ‘నిన్నుకోరి’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు నివేదా. ‘నిన్నుకోరి’ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ సినిమా అవకాశం దక్కించుకుని.. ఆ సినిమాతోనూ మంచి మార్కులు కొట్టేసింది.

Nani-to-Nivetha-Thomas

చదువును పూర్తి చేయడం కోసం ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా చదువు పూర్తి చేసుకున్న అమ్మడు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కొద్ది సేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఏ సినిమాలో నటిస్తున్నారు అని ఓ అభిమాని అడగగా.. కల్యాణ్ రామ్ సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమా పూర్తికాగానే వెంటనే మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నానని తెలిపింది.

మరో అభిమాని నీకు చెన్నై ఇష్టమా..? హైదరాబాద్ ఇష్టమా..? అని అడిగితే… చెన్నై నా ఇల్లు, హైదరాబాద్ అంటే ఇష్టం. ఎప్పుడు చెన్నైలో ఉండడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక మరో అభిమాని మీరు అంటే నాకు చాలా ఇష్టం.. మీ నంబర్ ఇస్తారా..? అని అడగగా.. నిర్మోహమాటంగా ఇవ్వలేనంటూ చెప్పేసింది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ అని అడిగితే.. నాని అని చెప్పేసింది.

- Advertisement -