అందుకే తెలుగులో సినిమాలు చేయట్లేదు:నివేదా

454
niveda thomos
- Advertisement -

జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనబ్యూటీ నివేదా థామస్‌. తర్వాత నిన్నుకోరి,జై లవకుశ సినిమాతో స్టార్‌గా ఎదిగిన నివేదా తర్వాత కళ్యాణ్ రామ్‌తో 118 మూవీ చేసి చెప్పింది. తాజాగా శ్రీవిష్ణుతో బ్రోచేవారెవరురా నటించగా ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి షూటింగ్ ఆలస్యమే కారణమని తెలిపింది నివేదా. బ్రోచేవారెవరురా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని.. సమాజంలోని కొన్ని అంశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలపింది. ఈ సినిమాలో క్యారెక్టర్‌ నా స్వభావానికి దగ్గరగా ఉంటుందన్నారు.

జై లవకుశలో చిన్న పాత్రే అయినా ఎన్‌టిఆర్‌ ఉన్నారని నటించానని తెలిపారు నివేదా. హీరో ఎవరు,బ్యానర్ ఏంటనే దానిపై ముందుగా డిసైడ్‌ అవ్వను… కథ విన్నాక మిగిలినవి ఆలోచిస్తానని తెలిపారు నివేదా. అన్నీ కలిసి ఉంటేనే సినిమా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. రజనీకాంత్ దర్బార్ చిత్ర యూనిట్ నుంచి పిలుపువచ్చింది కానీ ఇంకా ఫైనల్‌ కాలేదని తెలిపింది. ఈ సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపింది.

- Advertisement -