ఆగ‌ష్టు 9న “నివాసి” వస్తున్నాడు..!

393
nivasi
- Advertisement -

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంతో ఇటీవ‌ల ఎమ‌జాన్ ప్రైమ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో 8.4 రేటింగ్‌తో ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు అందుకుంటున్న‌ శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా, స‌తీష్ రేగ‌ళ్ళని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌లో కె.ఎన్‌.రావు నిర్మాత‌గా నిర్మిస్తున్నచిత్రం నివాసి. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టు 9న విడుద‌ల చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి.చ‌ర‌ణ్-అర్జున్ సంగీత ద‌ర్శ‌కులు.

nivasi movie

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీష్ రేగ‌ళ్ళ మాట్లాడుతూ.. ఇటీవ‌ల ఎమాజాన్ ప్రైమ్‌లో శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమాలో శేఖ‌ర్ వ‌ర్మ చాలా చ‌క్క‌గా న‌టించి మెప్పించాడు. దానికి వ‌స్తున్న ఎప్లాజ్ చూస్తున్నారు. మా నివాసి చిత్రం దాన్ని మించిన ఎమెష‌న్‌తో ప్ర‌తి ఓక్క‌రి మ‌న‌సు గెలుచుకునేలా వుంటుంది. మా నివాసిలో హీరో శేఖ‌ర్‌లోని ఇంకో యాంగిల్‌ని చూపింస్తున్నాము. ఈ చిత్రం త‌రువాత శేఖ‌ర్ చాలా మంచి న‌టుడుగానే కాకుండా స‌క్స‌స్‌ఫుల్ హీరోగా నిల‌బ‌డ‌తాడు. అలాగే నిర్మాత‌లు కె.ఎన్‌.రావు, వ‌ర్మ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కించారు.ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 9న విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.

nivasi stills

హీరో శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఇటీవ‌ల శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట అనే చిత్రం ఎమాజాన్ ప్రైమ్‌లో చూసిన ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న ప్ర‌శంశ‌లు నాలో వున్న ఉత్సాహ‌న్ని రెట్టింపు చేసాయి. ఆ ఆనందంలో చేసిన నివాసి చిత్రం నా కెరీర్‌లో మ‌రో మంచి చిత్రంగా నిలుస్తుందనే న‌మ్మ‌కం నాకుంది. ఈ చిత్రంతో నేను అంద‌రికి రీచ్ అవుతాన‌ని న‌మ్ముతున్నాను. ఒక మంచి ట్రావ‌ల్ స్టోరి, ద‌ర్శ‌కుడు స‌తీష్ చాలా క‌ష్ట‌ప‌డి అంత‌కి మించి ఇష్ట‌ప‌డి చేశాడు. ప్ర‌తి మనిషి ఒక‌సారి ఆలోచించుకునేలా ఈ చిత్ర క‌థ వుంటుంది. త‌ప్ప‌కుండా అంద‌ర్నిఆక‌ట్ట‌కుంటుంది. అని అన్నారు.

- Advertisement -