రెచ్చిపోయిన ముంబై కుర్రాళ్ళు …

221
- Advertisement -

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ అద్భుతంగా బోణీ చేసింది. 17 ఓవర్ల వరకు మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వైపే ఉన్నా… నితీశ్‌ రాణా (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో ఈ జోడి బౌండరీల వర్షంతో కోల్‌కతాను వణికించింది.
 Nitish Rana and Hardik Pandya Take Mumbai Indians
19వ ఓవర్‌లో రాణా అవుట్‌ అయినా… చివరి ఓవర్‌లో కావాల్సిన 11 పరుగులను హార్దిక్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా సాధించాడు. దీనికితోడు కోల్‌కతా చెత్త ఫీల్డింగ్‌ కూడా ముంబైకి ఉపకరించింది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. నితీశ్‌ రాణాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 81 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌:

గంభీర్‌ (సి) మెక్లెనగన్‌ (బి) కృనాల్‌ 19; లిన్‌ ఎల్బీ (బి) బుమ్రా 32; ఉతప్ప (సి) హార్దిక్‌ (బి) కృనాల్‌ 4; మనీష్‌పాండే నాటౌట్‌ 81; యూసుఫ్‌ పఠాన్‌ (సి) హార్దిక్‌ (బి) కృనాల్‌ 6; సూర్యకుమార్‌ (సి) పొలార్డ్‌ (బి) మలింగ 17; వోక్స్‌ (సి) పొలార్డ్‌ (బి) మలింగ 9; నరైన్‌ ఎల్బీ (బి) మెక్లెనగన్‌ 1; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178;

వికెట్ల పతనం:
1-44, 2-48, 3-67, 4-87, 5-131, 6-144, 7-178;
బౌలింగ్‌: మలింగ 4-0-36-2; మెక్లెనగన్‌ 4-0-51-1; బుమ్రా 4-0-39-1; కృనాల్‌ పాండ్య 4-0-24-3; హర్భజన్‌ 4-0-27-0

ముంబయి ఇన్నింగ్స్‌:

పార్థివ్‌ ఎల్బీ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 30; బట్లర్‌ ఎల్బీ (బి) రాజ్‌పుత్‌ 28; నితీష్‌ రాణా (సి) నరైన్‌ (బి) రాజ్‌పుత్‌ 50; రోహిత్‌శర్మ ఎల్బీ (బి) నరైన్‌ 2; కృనాల్‌ పాండ్య (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్‌ 11; పొలార్డ్‌ (సి) రిషి ధావన్‌ (బి) వోక్స్‌ 17; హర్దిక్‌ పాండ్య నాటౌట్‌ 29; హర్భజన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12;

మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 180;
వికెట్ల పతనం:
1-65, 2-71, 3-74, 4-97, 5-119, 6-160; బౌలింగ్‌: బౌల్ట్‌ 3.5-0-47-0; వోక్స్‌ 4-0-34-1; నరైన్‌ 4-0-22-1; కుల్దీప్‌ 4-0-35-1; రాజ్‌పుత్‌ 4-0-37-3

- Advertisement -