నాని…దసరాలో నిత్యా!

137
nani
- Advertisement -

రిలీజ్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ఇటీవలె టక్ జగదీష్‌ సినిమాతో ఆకట్టుకున్న నాని… ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక దసరా సందర్భంగా నాని 29వ సినిమా దసరా టైటిల్ లుక్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ నానితో స్క్రీన్ స్పేస్ పంచుకోనుండగా సాయి కుమార్, సముద్రకని, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘దసరా’ మూవీలో ఓ గెస్ట్ రోల్ కోసం టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.

ప్రస్తుతం నిత్యా…సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తోంది.

- Advertisement -