పెళ్ళికి సిద్ధమైన నిత్యా మీనన్

43
- Advertisement -

నిత్యా మీనన్ సహజ నటి. పైగా మంచి ఫాలోయింగ్ ఉన్న నటి. ఐతే, ఈ మధ్యన నిత్యా మీనన్ పేరు పెద్దగా వినిపించడం లేదు కానీ.. ఒకప్పుడు నిత్యా మీనన్ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. నితిన్ లాంటి కుర్ర హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో కూడా జోడి కట్టడమే కాకుండా.. పలు షోలకు జడ్జ్ గా కూడా నిత్యా మీనన్ అలరించింది. ఐతే, అప్పట్లో నితిన్ తో నిత్యా మీనన్ ప్రేమలో ఉంది అనే ప్రచారమూ జరిగింది. అది రూమర్ అని కొట్టిపారేసినా.. ఓ తమిళ హీరోతో ఒకటి రెండు సినిమాల్లో కనిపించేసరికి.. అతన్ని పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ నిన్నమొన్నటివరకు వినిపిస్తూనే ఉంది.

ప్రస్తుతం నిత్యా మీనన్ కి తెలుగులో అవకాశాలు అడుగంటడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఆమె అక్కడ కూడా అంతంతమాత్రపు అవకాశాలే అందుకుంటుంది. దీంతో ఓటిటీ ప్లాట్ ఫామ్ పైకి కూడా నిత్యా మీనన్ ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సీరీస్, చిన్న సినిమాలతో కాలక్షేపం చేస్తున్న నిత్యా మీనన్ ఫైనల్ గా పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేరళకు చెందిన ఓ హోటల్ బిజినెస్ మ్యాన్ ని నిత్యా మీనన్ వివాహమాడేందుకు రెడీ అయినట్లుగా టాక్ నడుస్తోంది.

పైగా ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చినట్లుగా కేరళ సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే నిత్యా మీనన్ పెళ్లికి సంబందించిన మాటలు కూడా పూర్తయ్యాయి, త్వరలోనే నిత్యా మీనన్ తన పెళ్లి వార్తని ప్రకటిస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా నిత్యా మీనన్ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. మరి ఈ వార్త కూడా అలాంటి వార్తేనా లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది.

Also read:USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు

- Advertisement -