నిత్యామీనన్ ఇంట విషాదం..

56
- Advertisement -

నటి నిత్యా మీనన్ ఇంట విషాదం నెలకొంది. నిత్యా అమ్మమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నిత్యా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అమ్మమ్మ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్ అంటూ పోస్ట్ పెట్టింది నిత్యామీనన్.

దక్షిణాదిలో ఒకప్పుడు క్రేజ్ ఉన్న హీరోయిన్ నిత్యామీనన్. సహజత్వానికి దగ్గరగా పాత్రను తీసుకెళ్లడం ఆమెకి బాగా తెలిసిన విద్య. అందువలన ఆమె నటనను ఇష్టపడే అభిమానులు చాలామందినే ఉన్నారు. సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ మంచి పేరు దక్కించుకుంది ఈ బ్యూటీ.

Also Read:బోడ కాకరకాయలు తింటే.. ఎన్నో రోగాలు దూరం!

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. గతేడాది పవన్‌ కల్యాణ్‌ సరసన భీమ్లానాయక్‌ లో కనిపించి అలరించింది. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

Also Read:స్వదేశంలో పెట్టుబడులు పెట్టండి:ఎమ్మెల్సీ కవిత

- Advertisement -