బూతు బాగోతం పై హీరోయిన్ స్పందన

46
- Advertisement -

ఇది ఆర్టిఫిషియల్ జనరేషన్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ వచ్చిన తర్వాత.. మొత్తం మారిపోయింది. గతంలో హీరోయిన్ల ఫొటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి నెట్టింట అప్ లోడ్ చేయడం కొన్ని చోట్ల చూశాం. కానీ, ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ వ్యవహారం చాలా కామన్ అయిపోయింది. పైగా రోజురోజుకూ ఇది మరింత విశృంఖలంగా మారిపోతుంది. హీరోయిన్ నిత్యా మీనన్ కూడా ప్రస్తుతం ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఫొటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి కొన్ని ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఇదే విషయం పై నిత్యా మీనన్ కూడా తన సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తూ తెగ ఫీల్ అయిపోతుంది. “హీరోయిన్లను చాలా దారుణంగా కొందరు చూడాలని ఆశ పడతారు. నేను ఎక్కడికి వెళ్లినా నా అనుమతి లేకుండా ఫొటోలు తీస్తారు. ఇది ప్రతి హీరోయిన్ కి ఉన్న సమస్యే. నిజానికి ఈ సమస్య మాకు ఎలా మారిపోయింది అంటే.. ఒక అలవాటైంది. కానీ నటీనటుల ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేసి సైట్స్ లో పెట్టే వారిని ఏమి అనాలి ?, ఓ నటి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ?, మరెన్నో బాధలు ఉంటాయి.

వాటికి తోడు ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి అంటే ఎవరి వల్ల కాదు. ఇలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏఐతో చాలామంది ఆడపిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపిన నిత్యా మీనన్.. సైట్స్ లో మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు చూసి చాలామంది నిజం అని భ్రమ పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు తనకు చాలా ఆందోళనగా ఉంటుందని నిత్యా మీనన్ అంటోంది.

Also Read:ట్రైలర్ టాక్ : ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ కుమ్మేశాడు

- Advertisement -