- Advertisement -
యూత్ స్టార్ నితిన్ వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. చెక్, రంగ్‌దే సినిమాల తర్వాత ఆయన నటిస్తోన్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలయ్యాయి. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మాస్ట్రో’ టైటిల్‌ను ఖరారు చేశారు. నితిన్ ఫస్ట్ లుక్ అలరిస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్‌ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ఏడాది జూన్ 11న సినిమాను విడుదల చేస్తున్నారు.
- Advertisement -