‘గుండెజారి గల్లంతయ్యిందే’ సీక్వేల్ కు రంగం సిద్దం..

246
gundejari gallantayende
- Advertisement -

యంగ్ హీరో నితిన్ ఇటివలే నటించిన మూడు చిత్రాలు లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస్ కళ్యాణం పరాజయం అయ్యాయి. శ్రీనివాస కళ్యాణం మూవీ తర్వాత ఇప్పటి వరకూ ఆయన వేరే సినిమా షూటింగ్ లో పాల్గోనలేదు. ఇక ప్రస్తుతం ఆయన ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తుంది. ఈసినిమాలో నితిన్ సరసన రష్మీక మందన నటించనుంది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

గుండెజారి గల్లంతయ్యిందే మూవీ దర్శకుడు విజయ్ కుమార్ కొండా తో నితిన్ మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. ఇక నితిన్ లైఫ్ లో గుండెజారి గల్లంతయ్యిందే మూవీ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. . కథలో కొత్తదనం ఉండటంతో నితిన్ ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇక దర్శకుడు విజయ్ గుండెజారి గల్లంతయ్యిందే మూవీ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా తీశాడు. ఈమూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆయన మళ్లి సినిమాలు తీయలేదు. ఇక నితిన్ భీష్మ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. భీష్మ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విజయ్ కుమార్ కొండాతో సినిమా చేయనున్నాడు నితిన్.

- Advertisement -