‘ఛల్ మోహన్‌ రంగ’కు ఫిక్స్ అయిన నితిన్

210
Nithin25 Chal Mohana Ranga
- Advertisement -

హీరో నితిన్ కొత్త సినిమా టైటిల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ అనే టైటిల్ పెట్టారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ వీరాభిమాని అయిన నితిన్‌కు ఇది 25వ సినిమా కావడం విశేషం. నితిన్ సరసన ‘లై’ బ్యూటీ మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Nithin25 Chal Mohana Ranga

చ‌ల్ మోహ‌న్ రంగ అనే టైటిల్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకునేలా ఉంది. ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి క‌థ అందించాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కానుంది.రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 5న వేసవి కానుకగా ఛల్ మోహన్ రంగ థియేటర్లలోకి రానుంది. పీకే క్రియేటివ్ ఆర్ట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. అది కాసేపట్లోనే ట్రెండింగ్‌గా మారింది.

- Advertisement -