వరుణ్ తేజ్- హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. సెప్టెంబర్ 20(రేపు) ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సత్తాచాటిన వాల్మీకి రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ నేపథ్యంలో మెగా హీరోకు విషెస్ చెప్పాడు హీరో నితిన్. వాల్మీకితో వరుణ్ పెద్ద హిట్ కొట్టాలని…కష్టమైన తెలంగాణ స్లాంగ్‌ను అద్భుతంగా పలికాడని చెప్పారు. గద్దలకొండ గణేష్‌కి బీష్మా బెస్ట్ విషెస్ చెబుతున్నాడని ట్వీట్టర్‌లో ట్వీట్ చేసిన నితిన్ సెప్టెంబర్ 20న గత్తరలేపాలా అంటూ పేర్కొన్నాడు.
వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.
With Mr. Gaddhala Konda Ganesh…😎 Really enjoyed being part of #Valmiki, it was so much fun. I Wish you all the good luck for the release… Yours Bheeshma 😘
Sept 20th na GATTHAR LEPALA😍😍 @harish2you pic.twitter.com/C629XGo5Zh— nithiin (@actor_nithiin) September 18, 2019