మహేష్ బాటలో నితిన్?

11
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవనున్నారు హీరో నితిన్. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్‌ని ప్రారంభించగా నితిన్ సైతం ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఓ మల్టిప్లెక్స్‌ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

ఏఎన్‌ఎస్‌ సినిమాస్‌ అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నితిన్‌కు సంగారెడ్డి పట్టణంలో సితార పేరుతో ఓ థియేటర్‌ ఉంది. ప్రస్తుతం ఈ థియేటర్‌ను రేనోవేషన్‌ చేస్తుండగా ఇదే థియేటర్‌ను ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్‌కు ఏషియన్‌ నితిన్‌ సితార అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మల్టీప్లెక్స్‌లను ప్రారంభించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మహేష్‌ బాబు ఏఎమ్‌బీ, విజయ్‌ దేవరకొండ మహబూబ్ నగర్‌లో AVD సినిమాస్‌, అల్లు అర్జున్ అమీర్‌పేట్లో ఏఏఏ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also Read:Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

- Advertisement -