నితిన్..రాబిన్ హుడ్ రిలీజ్ డేట్

29
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్ అంశాలే కాకుండా తగినంత వినోదాన్ని కలిగి ఉండే సినిమాకి ఇది సరైన విడుదల. రిలీజ్ డేట్ పోస్టర్ లో నితిన్ ముఖం లో ఇంటెన్సిటీ కలిగి ఉండి స్పోర్ట్స్ బైక్పై మ్యాచో లా కనిపిస్తున్నారు.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ లెన్స్మెన్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read:టెనెంట్.. మనం చూస్తూ ఉండే కథ

- Advertisement -