Nithin:రాబిన్‌హుడ్ అప్‌డేట్

5
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్‌హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబందించిన అప్డేట్ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read:మెగా డీఎస్సీపై బాబు తొలి సంతకం

- Advertisement -