పవన్‌ రీ ఎంట్రీపై నితిన్‌ ఆసక్తికరకామెంట్స్‌..!

238
pawan
- Advertisement -

యంగ్ హీరో నితిన్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్న నితిన్ తాజాగా పవన్ రీ ఎంట్రీపై తనదైన శైలీలో స్పందించారు.

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాల హ్యాపీ గా ఉందని…. ఆయన మాస్ సినిమానే చేయాలనేం లేదు జస్ట్ మాకు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలన్నాఉ. రాజకీయాల్లోకి వెళ్ళినా హీరోగా ఆయన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని హీరోగా సినిమా చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో కి అదే హంగామా ఉంటుందని పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు నితిన్.

మణిశర్మ కుమారుడు మహతి సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈచిత్రిన్ని నిర్మిస్తున్నారు. నితిన్ సరైన హిట్ లేక చాలా కాలం కావడంతో ఈమూవీపై భారీ అంచానాలు పెట్టుకున్నాడు.

- Advertisement -