శ్రీనివాస కళ్యాణం తర్వాత ఒక్క సినిమా కూడా పట్టాలెక్కించలేదు యంగ్ హీరోనితిన్. ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అవుతున్న నితిన్ హోళి కానుకగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్న నితిన్ ఈ సినిమా సెట్స్‌పై వెళ్లేందుకు రెడీగా ఉండగా.. మరో రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండబోతుందని.. ఈ సినిమా ఏప్రిల్‌లో మొదలు కానుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. అలానే రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ మరో ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. మొత్తానికి ఈ ఏడాదిలో ముచ్చటగా మూడు చిత్రాలతో బిజీగా మారారు నితిన్.
జయం, దిల్ చిత్రాలతో కెరియర్ స్టార్టింగ్‌లో జోష్ ఫుల్ హిట్లు అందుకున్నారు నితిన్. 25కి పైగా సినిమాలు చేసిన నితిన్ అ..ఆ, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి హిట్లు అందుకున్నారు. కెరియర్ గ్రాఫ్‌లో పరాజయాల శాతమే ఎక్కువగా ఉన్న నితిన్ ఇటీవల శ్రీనివాస కళ్యాణం, చల్ మోహన్ రంగ, లై, కొరియర్ బాయ్ కళ్యాణ్, చిన్నదాన నీకోసం ఇలా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2019లో మూడు సినిమాలతో వస్తున్న నితిన్ కెరీర్ తిరిగి గాడిలో పడుతుందో వేచిచూడాలి.
As i promised Announcement 1 :
Doing a film with the supremely talented Chandrashekar Yeleti garu produced by Anand prasad garu under Bhavya creations and music by M.M keeravani garu..super excited about this one
Shoot starts frm mid april..
Other details soonHappy holi
— nithiin (@actor_nithiin) March 21, 2019