నితిన్‌ పెళ్లి పెద్ద ఎవరో తెలుసా…

302
- Advertisement -

టాలీవుడ్‌ హీరోల్లో ప్రస్తుతం బ్యాచిలర్స్‌ చాలా మంది ఉన్నారు. అందులో ప్రభాస్‌,సాయి ధరమ్ తేజ్ , అల్లు శిరీష్‌, నితిన్ ఇలా కొంత మంది ఉన్నారు. కాని టాలీవుడ్‌లో రోజుకొ పెళ్లి వార్త బయటకి వస్తుంది. ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటున్నాడని మొన్నటి వరకు కూడా గాసిప్స్‌ వినిపించాయి. కాని బాహుబలి -2తర్వాత తన పెళ్లి ఫిక్స్‌ అని ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చాడు.

nithin marriage

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా ఉన్న నితిన్ పెళ్లి గురించి కూడా అప్పట్లో జోరుగానే ప్రచారం జరిగింది. అయితే….ప్రస్తుతం నితిన్‌కి పెళ్ళి ఘడియలు దగ్గర పడ్డాయట. నితిన్ చేసుకోబోయే అమ్మాయి మాత్రం అక్కినేని అఖిల్‌కు తప్ప మరెవ్వరికీ పెద్దగా తెలియదట. నితిన్‌ చేసుకునే అమ్మాయి అఖిల్‌కి ఎలా తెలుసు అనే సందేహం రావచ్చు కాని ఇక్కడ నితిన్‌ పెళ్లి పెద్ద అఖిలేనట. నితిన్‌ పెళ్లి చేసుకునే అమ్మాయి అఖిల్‌కి కాబోయే భార్య శ్రియా భూపాల్‌కి బెస్ట్‌ ఫ్రేండట.

nithin marriage

అఖిల్ మూవీని నితిన్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే నితిన్-అఖిల్‌ల మధ్య బంధం బాగా బలపడింది. ఇద్దరూ తమ పర్సనల్‌ విషయాలను సైతం షేర్ చేసుకునేవారట. అదే టైంలో అఖిల్ ప్రేయసి శ్రియా భోపాల్ తన క్లోజ్ ఫ్రెండ్‌తో రావడం… తనని నితిన్‌కి పరిచయం చేయడం… ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. నితిన్‌పై మంచి అభిప్రాయం ఉన్న అఖిల్ ఇరు కుటుంబాలతో మాట్లాడటంతో ఈ పెళ్లికి అంగీకరించారని సమాచారం . మొత్తానికి సిసింద్రీ అఖిల్ తాను పెళ్లికొడుకు కావడంతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ నితిన్‌కి పెళ్లిపెద్ద అయిపోయాడు.

nithin marriage
అ..ఆ సినిమాతో మంచి హిట్‌ అందుకున్న నితిన్‌ మరో సినిమా చేయాడానికి ప్రస్తుతం కమిట్‌ కాలేదు. అయితే… పెళ్లి తర్వాతనే మరో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే నితిన్ పెళ్లి పై మరికొన్నిరోజుల్లో స్పష్టత రానుంది.

nithin marriage

- Advertisement -