ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అరలించేందుకు సిద్దమవుతున్నారు నితిన్. ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ కాగా మరొకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో మూవీ.
ఇక ఈ రెండు సినిమాలు పట్టాలపై ఉండగానే కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నితిన్. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోండగా పవర్ పేట అనే టైటిల్ని ఖరారు చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. రంగ్ దే సినిమాలో నితిన్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ఈ మూవీలో కూడా నటించనుందట. కథతో పాటు తన పాత్రచిత్రణ నచ్చడంతో కీర్తిసురేష్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.
గోదావరి యాసతో కీర్తిసురేష్ పాత్ర వినూత్నంగా సాగుతుందని టాక్. ఓ యువకుడి జీవితంలోని నాలుగు దశల్ని ఆవిష్కరిస్తూ రూపొందనున్న ఈ చిత్రంలో నితిన్ 20 ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయస్కుడిగా కనిపించనున్నారట.