వక్కంతం వంశీతో నితిన్‌..!

118
Nithiin
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నితిన్. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్న నితిన్….తాజాగా కొత్త ప్రాజెక్టును అనౌన్స్‌చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ సిద్ధం చేసిన కథకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు.

హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా నితిన్‌ కెరీర్‌లో 32వది కాగా ముహూర్తం షాట్‌కు పుస్కూర్ రామ్‌మోహన్‌రావు క్లాప్‌ కొత్తగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, ఠాగూర్ మధు స్క్రిప్ట్‌ను అందజేశారు.

- Advertisement -