డిసెంబరులో హీరో నితిన్‌ పెళ్లి..!

358
Nithin getting married in December
- Advertisement -

టాలీవుడ్ హీరో నితిన్ ఎట్టకేలకూ పెళ్లి పీటలు ఎక్కుదామని సర్వం సిద్ధం చేసుకున్న వేళ కరోనా రూపంలో ఆయన పెళ్ళికి అడ్డంకి వచ్చి చేరింది. నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం చేసుకున్నారు. మొదట నితిన్ దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలనుకున్నా… క‌రోనా కారణంగా అది కుదరలేదు. ఆ తరువాత త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు నితిన్ ప్రకటించాడు.

 Nithin getting married in December

కాగా, తాజాగా నితిన్‌ పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఇకపోతే నితిన్ కరోనా అనంతరం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం షూట్ ను చేయనున్నారు.

- Advertisement -