‘వాటే బ్యూటీ’ అంటున్న నితిన్

399
nithin

యంగ్ హీరో నితిన్ రష్మీక మందన జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రాన్ని వచ్చే నెల 21న విడుదల చేయనున్నారు.

ఇటివలే విడుదలయిన ఈమూవీ టీజర్ కు అద్భుతైమన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. ‘వాటే బ్యూటీ’ అనే పాట ప్రోమోను ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇతర ముఖ్యపాత్రలను అనంత్ నాగ్ .. వెన్నెల కిషోర్ .. నరేశ్ .. రాజీవ్ కనకాల నటించారు. కాగా గత కొద్ది రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ కు ఈమూవీతో హిట్ వస్తుందేమో చూడాలి.