నితిన్ ‘భీష్మ’ విడుదల తేదీ ఖరారు

574
Nithin Bheeshma
- Advertisement -

యంగ్ హీరో నితిన్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈసినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ఈమూవీలో ఫస్ట్ సాంగ్ ను ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది . ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 21న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈచిత్రిన్ని నిర్మిస్తున్నారు. నితిన్ సరైన హిట్ లేక చాలా కాలం కావడంతో ఈమూవీపై భారీ అంచానాలు పెట్టుకున్నాడు.

- Advertisement -