- Advertisement -
యంగ్ హీరో నితిన్ రష్మీక మందన జంటగా నటించిన చిత్రం భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ ఈమూవీలో ముఖ్య పాత్రలో నటించింది.
ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నేడు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రానున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. కాగా నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అ..ఆ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది.
- Advertisement -