- Advertisement -
యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం భీష్మ. ఈమూవీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రష్మీక మందన హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సీతార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈచిత్రాన్ని నిర్మించారు. ఇటివలే విడుదలైన ఈమూవీ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భతమైన స్పందన వస్తోంది.
కాగా ఈమూవీపై పెద్ద ఎత్తున అంచానాలు నెలకొన్నాయి. ఈచిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన 6.5 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈనెల 16న ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
- Advertisement -