మహాశివరాత్రికి నితిన్ భీష్మా..!

802
nithin
- Advertisement -

శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీష్మా. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. కానీ తాజాగా రిలీజ్ డేట్ మారింది.

2020 మహాశివరాత్రికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. టీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

నితిన్ సరసన రష్మీక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడు నితిన్.

- Advertisement -