ఇటలీలో నితిన్ ‘రంగ్ దే’..

115
nithin

హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి సంబందించిన తర్వత షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.

ఇటలీ షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరించాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు.‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.