రొమాంటిక్‌గా నితిన్ ‘రంగ్ దే’ ట్రైలర్..

203
Nithiin Rang De​ Trailer

యూత్‌ స్టార్‌ నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ”రంగ్ దే” సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో నితిన్‌కు జంటగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈమూవీ మార్చి 26న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఈరోజు కర్నూల్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా తాజాగా ‘రంగ్ దే’ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘నేను అర్జున్.. దేవుణ్ణి నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ని ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకన్ కి ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి నా జీవితాన్ని తొక్కడం స్టార్ట్ చేసింది’ అంటూ నితిన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ పై దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే యూత్‌కు అకట్టుకునేలా కనిపిస్తోంది.

#RangDe Official Trailer | Nithiin, Keerthy Suresh | Venky Atluri | Devi Sri Prasad